శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:56 IST)

నెయిల్ రిమూవర్ వాడిన ప్రతిసారీ...?

గోళ్లకు రంగు ఎంత సులువుగా వేసుకుంటామో.. అదే విధంగా దానిని తొలగించేందుకు కూడా రిమూవర్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ రిమూవర్లు ఎప్పుడైతే వచ్చాయో.. ఈ నెయిల్ పాలిష్ వాడడం ఎక్కువైపోయింది. ఈ రిమూవర్ కొంత మేలు చేసినా ఒక్కోసారి కీడు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు బ్యూటీ నిపుణులు. మరి రిమూవర్లతో గోళ్లు పాడవకుండా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం...
 
1. గోళ్లకు రంగును తొలగించిన తరువాత కనీసం ఒక రోజు రంగు వేయకుండా అలానే వదిలేయాలి. రిమూవర్ మంటను ఆకర్షిస్తుంది. కాబట్టి రంగులున్న ప్రాంతాల్లో మాత్రం దానిని వాడాలి. 
 
2. గోళ్లు పొడిబారకుండా ఉండాలంటే.. రంగు తొలగించిన తరువాత గోళ్లకు క్యూటికల్ క్రీమ్ రాస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆ రిమూవర్‌ను దూది మీద ఒంపి, గోరు మీద కొన్ని సెకన్లపాటు అదిమి ఉంచి.. రిమూవర్ నెయిల్ పాలిష్‌లో ఇంకిన తర్వాతనే తుడవాలి. ఇలా చేస్తే రంగును తేలికగా తొలగించవచ్చు.
 
3. నెయిల్ రిమూవర్ వాడిన ప్రతిసారీ గోళ్లు పొడిబారకుండా ఉండాలంటే.. విటమిన్ ఇ, గ్రేప్‌సీడ్, ల్యావెండర్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ రిమూవర్స్ వాడితే మంచిది.