శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (15:36 IST)

గోరువెచ్చని కొబ్బరినూనెతో...?

స్త్రీలు చేతివేళ్లను లేత బెండకాయలతో పోలుస్తారు. అందమైన చేతివేళ్లకు అందమైన గోళ్లు కూడా అంతే సొగుసుగా ఉండాలి.. కానీ తరచు సబ్బునీళ్లల్లో, వంటపనిలో నిమగ్నమవ్వడం కారణంగా గోళ్లు మొరటుగా తయారవుతాయి. నెయిలి పాలిష్‌ని అదేపనిగా వాడడం వలన కూడా గోళ్ల రంగు మారి అందవిహీనంగా తయారవుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలంటున్నారు.. మరి అవేంటో చూద్దాం..
 
1. నెయిల్‌ పాలిష్‌ని అదేపనిగా వాడడం వలన కూడా గోళ్లు రంగు మారి అందవిహీనంగా తయారవుతుంటాయి. అలా జరక్కుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. 
 
2. చేతిగోళ్లకు తరచూ నువ్వులనూనెను రాసుకోవాలి. ఈ నూనె చర్మం మెత్తబడేలా చేసే లక్షణం కలిగి ఉంటుంది. కొబ్బరినూనెను కూడా వాడ్చొచు. 
 
3. రోజూ దుస్తులు ఉతకాల్సి వస్తే మాత్రం చేతికి గ్లోవ్స్‌ ధరించాలి. లేదంటే సబ్బు తాలూకు అవక్షేపాలు.. క్షారాలు చర్మాన్ని మొరటుగా మారుస్తాయి. 
 
4. నెయిల్‌పాలిష్‌ వాడడం మూలానా గోళ్ళు అనారోగ్యం పాలవుతాయి. కాబట్టి గోళ్ళకు నెయిల్ పాలిష్ వాడకుండా మానేస్తే మరీ మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో గోళ్ళకు ప్రాణ వాయువు శులభంగా లభిస్తుంది. 
 
5. మీ చేతి వేళ్ళను గోరువెచ్చని కొబ్బరినూనెతో వారానికి రెండుసార్లు మర్థనచెయ్యాలి. దీని వలన గోళ్లు ఆరోగ్యంగా ఎదుగుతాయి. 
 
6. అరకప్పు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మకాయని పిండి అందులో 5 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత పరిశుభ్రమైన చల్లని నీటితో కడిగేయండి.