గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2016 (16:26 IST)

పిల్లలకు హెల్దీ స్నాక్స్.. చపాతీ ఆమ్లెట్ చేయడం ఎలా?

ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడకయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుల్ని చేర్చి దోరగా వేపాలి. మరో బౌల్‌లో వేయించిన ఉల్లి మిశ్రమానికి, శెనగపిండి, పసుపు పొడి, ఉప్పు, కొత్తిమీర కాస

పిల్లలకు ఇష్టపడి తినే స్నాక్స్ చేసి పంపుతున్నారా? షాపుల్లో అమ్మే ఆహార పదార్థాలతో స్నాక్స్ బాక్స్ నింపేస్తున్నారా? అయితే ఇక అలా చేయకండి. ప్రతిరోజూ వారికి హెల్దీ స్నాక్స్ ఇచ్చిపంపండి. అందుకే వెరైటీగా ఆమ్లెట్ చపాతీ ఎలా చేయాలో తెలుసుకోండి. గోధుమల్లోని ఫైబర్, కోడిగుడ్డులోని పుష్కలమైన పోషకాలు ఆరోగ్యానికి బలాన్నిస్తాయి.
 
ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు: 
చపాతీలు - రెండు 
కోడిగుడ్లు - మూడు 
శెనగపిండి - నాలుగు టేబుల్ స్పూన్లు
ఆనియన్ తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
పసుపు పొడి- ఒక స్పూన్  
కొత్తిమీర, కరివేపాకు తరుగు - రెండు స్పూన్లు 
ఉప్పు - తగినంత 
జీలకర్ర - అర స్పూన్
నూనె - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడకయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుల్ని చేర్చి దోరగా వేపాలి. మరో బౌల్‌లో వేయించిన ఉల్లి మిశ్రమానికి, శెనగపిండి, పసుపు పొడి, ఉప్పు, కొత్తిమీర కాసింత చేర్చి.. అందులోనే కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. ఆపై దోసె పెనం వేడయ్యాక చపాతీని వేడి చేసి.. గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని చపాతీపై పోసి.. నోరు పోసి ఆమ్లెట్‌లా వేగాక తిరగేసుకోవాలి. అంతే చపాతీ ఆమ్లెట్ రెడీ. ఈ చపాతీ ఆమ్లెట్‌కు గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.