శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (17:19 IST)

ఫ్రూట్స్ అండ్ డేట్స్‌తో ఎనర్జీ సలాడ్ ఎలా చేయాలో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే.. డేట్స్ సలాడ్ ట్రై చేయండి. 
కావలసిన పదార్థాలు :
క్యాలీఫ్లవర్ తరుగు : అరకప్పు 
డేట్స్ తరుగు : ఒక కప్పు 
కమలాపండు, ఆపిల్స్ ముక్కలు- అర కప్పు 
నిమ్మరసం - అర టేబుల్ స్పూన్ 
నిమ్మ తొనలు - అర టీ స్పూన్ 
నూనె - అర టేబుల్ స్పూన్ 
వెనిగర్ - అర టేబుల్ స్పూన్ 
ఉప్పు - తగినంత 
మిరియాల పొడి- ఒక టీ స్పూన్ 
కమలాపండ్లు- గార్నిష్ కోసం.. 
గట్టిపెరుగు- ముప్పావు కప్పు 
కమలాపండ్ల రసం - 4 టీస్పూన్లు 
ఆవ పొడి - అర టీ స్పూన్ 
పంచదార పొడి - అర టీ స్పూన్ 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం: 
ఒక పాత్రలో గట్టి పెరుగు, కమలాపండ్ల రసం, ఆవ పొడి, పంచదార పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి సుమారు అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. 
 
ఒక పాత్రలో తరిగిన క్యాలీఫ్లవర్‌కి కొద్దిగా నీళ్లు జతచేసి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి చల్లార్చాలి. నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి బాగా కలిపి ఊరనివ్వాలి. 
 
ఒక పాత్రలో ఉడికించిన క్యాలీ ఫ్లవర్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, అరటి పండ్లు ముక్కలు, కమలాపండు తొనలు, ఆపిల్ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగిన నిమ్మ తొనలు, నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తయారుచేసి ఉంచుకున్న కమలాపండ్ల డ్రెసింగ్ వేసి చల్లగా అందించాలి.