శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (17:30 IST)

హెల్దీ మష్రూమ్‌తో సూప్ సిప్ చేయండి!

మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో డి విటమిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లో కెలోరీస్ ఒబిసిటీని దూరం చేస్తాయి. మష్రూమ్స్ తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి మష్రూమ్‌తో సూప్ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
మష్రూమ్ - రెండు కప్పులు 
వెల్లుల్లి  - పావు కప్పు 
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు 
దాల్చిన చెక్క - ఒకటి 
కొత్తిమీర - కాసింత 
ఉప్పు, మిరియాల పొడి - తగినంత  
 
తయారీ విధానం : 
బాణలిలో నెయ్యి వేడయ్యాక దాల్చిన చెక్క వేసి వేపాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు చేర్చి వేపుకోవాలి. దోరగా వేగా మష్రూమ్ ముక్కల్ని వేసి దోరగా వేగాక మూడు నుంచి నాలుగు కప్పుల నీటిని చేర్చి తగినంత ఉప్పుతో ఉడికించాలి. మష్రూమ్ ఉడికాక మిరియాల పొడి చిలకరించి కాసేపుంచి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించేయాలి. అంతే మష్రూమ్ సూప్ రెడీ. ఈ సూప్‌ను కార్న్ చిప్స్‌తో హాట్ హాట్‌గా సిప్ చేస్తే టేస్టీగా ఉంటుంది.