గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By CVR
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:23 IST)

ఇండియన్ స్టైల్ టమోటా పాస్తా

కావల్సిన పదార్థాలు : 
పాస్తా - మూడు కప్పులు 
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్: ఒకటి మీడియం (ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో - 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు - మూడు పాయలు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిరపకాయలు - రెండు 
కర్రి పౌడర్ - ఒక టీస్పూన్
టమోటో సాస్ - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత 
నూనె: కొంచెం 
కొత్తిమీర: ఒక టీ స్పూన్
చీజ్ తురుము : కొంచెం
 
తయారు చేయండి ఇలా:
మొదట పాస్తాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత స్టౌమీద పాన్ పెట్టి. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, అందులో ఉల్లిపాయ మరియు క్యారెట్ ముక్కలువ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 
 
ఆ తర్వాత టమోటో ముక్కలు, వెల్లుల్లి పాయలు మరియు కొద్దిగా అల్లం మరియు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని, ఈ పేస్ట్ ను వేగుతున్న ఉల్లి, క్యారెట్ మిశ్రమంలో వేయాలి. 
 
ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీ పౌడర్, ఉప్పు, ముందుగా ఉడికించుకొన్న పాస్తా మరియు టమోటో సాస్ కూడా వేసి బాగా కలుపుకుని, మూత పెట్టి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. అంతే ఇండియన్ స్టైల్ టమోటా పాస్తా రెడీ. దీనిని పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆరగిస్తారు.