బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (16:54 IST)

పనీర్ టిక్కా తయారీ విధానం.....

పనీర్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. బీపీని నియంత్రించవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముడతల చర్మానికి మంచిగా సహాయపడుతుంది. జుట్టుకు పోష

పనీర్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. బీపీని నియంత్రించవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముడతల చర్మానికి మంచిగా సహాయపడుతుంది. జుట్టుకు పోషకాలను అందిస్తుంది. పనీర్‌లోని ప్రోటీన్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఎముకలకు, దంతాలకు మేలు చేస్తాయి. మాంసాహారంలోని ప్రోటీన్లకు సమమైన ప్రోటీన్లను ఇది అందిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాంటి పనీర్‌తో టిక్కా ఎలా చేయాలో చూద్దాం...
 
 
కావలసిన పదార్థాలు: 
పనీర్‌ - అరకేజీ 
క్యాప్సికం - 2 
గడ్డపెరుగు - అరకప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు 
గరంమసాలా - అరచెంచా
నిమ్మరసం - రెండు చెంచాలు 
ఆవనూనె - పావుకప్పు 
కారం - చెంచా, ఉప్పు - తగినంత
పోపుదినుసులు - మసాలా కోసం
ధనియాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
మెంతులు - 1/2 స్పూన్
సోంపు - 1/2 స్పూన్
ఆమ్‌చూర్ పొడి - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు పనీర్‌, క్యాప్సికం ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వాటిపై పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, నిమ్మరసం, ఆవనూనె, కారం, తగినంత ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి. తరవాత అన్నింటినీ బాగా కలపాలి. 20 నిమిషాల తరవాత ఈ ముక్కల్ని ఇనుప చువ్వలకు గుచ్చి గ్రిల్‌ పద్ధతిలో ఓవెన్‌లో కాల్చాలి. లేదా గ్రిల్‌ పెనాన్ని పొయ్యిమీద ఉంచి నిప్పులపై కాల్చుకోవాలి. అంతే పనీర్ టిక్కా రెడీ.