శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. ఫెంగ్ షుయ్
Written By PNR
Last Updated : శనివారం, 7 జూన్ 2014 (15:09 IST)

ఫెంగ్‌షుయ్ ప్రకారం బ్యాగ్‌లను ఎంచుకోవడం ఎలా?

సాధారణంగా హ్యాండ్ బ్యాగులను ఎంచుకునేటప్పుడు ఆకారం, రంగుని దృష్టిలోకి తీసుకున్నట్లైతే క్షేమదాయకమని చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. మామూలుగా దీర్ఘచతురస్త్రాకారంలో ఉన్న ఆకు పచ్చ, నలుపు, గోధుమ రంగు హ్యాడ్ బ్యాగులు మంచివని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. 
 
చతురస్త్రాకార హ్యాండ్ బ్యాగులైతే ఎరుపు, పసుపు పచ్చ, మెరూన్ రంగులు మంచివని, గుండ్రటి బ్యాగులైతే తెలుపు రంగు బాగుంటుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. తలకేసుకునే టోపీల విషయానికొస్తే నీళ్ళ అంశమైన నలుపు, నీలం రంగు టోపీలు తప్ప మిగిలిన ఏ టోపీలైనా మంచివేనని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది.