Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉగాది రోజున ఏం చేయాలి...?

మంగళవారం, 28 మార్చి 2017 (16:38 IST)

Widgets Magazine
Ugadi

వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతుంటాయి. ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఆ రోజున అశ్వినీ నక్షత్రం ఉంటుంది. 
 
మాసాల్లో చైత్రం, తిథుల్లో పాడ్యమి, నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అంటే ఉగాది ...కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజన్నమాట. అందుకే, ఇది కాలానికి సంబంధించిన అతిముఖ్యమైన పండుగ. ఉగాది తెలుగువారు కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు.
 
కొత్త ఏడాదికి ప్రారంభ దినమైన ఈరోజున వేకువ జామున లేచి నువ్వుల నూనె రాసుకుని తలంటుస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి నగలు, ఆభరణాలు ధరించాలి. తర్వాత మామిడి, వేప ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. 
 
ఉగాది నాడు ఉగాది పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి. ఇలా షడ్రుచులు కలుపుకొని పచ్చడి చేయడంలో కూడా అర్థముంది. బెల్లం అంటే తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకూ, విజయానికి సంకేతం. వేప అంటే చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడానికి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
 
ఉగాది నాటి సాయంత్రం తప్పక చేయాల్సింది పంచాంగ శ్రవణం. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు ఉండే పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ ఉగాదిన మనం శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. మన పెద్దలు చెప్పిన ప్రకారం ఉగాదిని ఆచరిస్తే ఆయురారోగ్యాలూ వస్తాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తిరుమల వైభవంపై బాహుబలి వంటి వీడియో: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం

తిరుమల శ్రీనివాసుడి వైభవంపై ఎన్జీసీలో సోమవారం రాత్రి ప్రసారమైన ‘ఇన్‌సైడ్‌ తిరుమల తిరుపతి’ ...

news

హనుమంతునికి మంగళవారం తమలపాకు మాలను ఎందుకు సమర్పిస్తారు?

విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే.. ముక్కంటి అభిషేక ప్రియుడు. అదే హనుమంతుడైతే.. స్తోత్ర ...

news

వినాయకుడిని మందార పువ్వులతో అర్చిస్తే...?

ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పాలున్నప్పటికీ.. కొన్ని పుష్పాలతోనే దేవాతార్చన చేస్తారు. ...

news

భద్రాచలం భక్తులకు ప్రసాదాలుగా వడపప్పు, పానకం.. శ్రీరామనవమి నుంచి శ్రీకారం..

శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో వెలసివున్న సంగతి ...

Widgets Magazine