గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (13:19 IST)

రక్షాబంధన్ పండుగ ఎలా వచ్చిందో తెలుసా? ఆగస్టు 26న రాఖీ పండుగ

శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. ముఖ్యంగా శ్రావణమాసం విష్ణుమూర్తి ప్రీతికరమైన మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా శ్రవణమే కనుక. ఈ నక్షత్రం చంద్రునితో కూడినది కాబట్టి ఈ మాసాన్ని శ్రా

శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. ముఖ్యంగా శ్రావణమాసం విష్ణుమూర్తి ప్రీతికరమైన మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా శ్రవణమే కనుక. ఈ నక్షత్రం చంద్రునితో కూడినది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసమని అంటారు. అంతేకాకుండా ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. ఆకాశం మబ్బులతో వెండికొండలను తలపిస్తుంటుంది.
 
పూర్వకాలం శ్రావణమాసంలోనే వేద అధ్యయనం ప్రారంభమయ్యేది. ఈ రోజును రక్షా పౌర్ణమి, జంధ్యాల పున్నమి, రాఖీ పూర్ణిమ, నూలు పున్నమి, నారికేళ పున్నమిగా జరుపుకుంటారు. ఈ పండుగ సోదరులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజున సోదరులకు సోదరీమణులు ఆప్యాయంతో కట్టే రక్షాబంధన్ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తోంది. 
 
ఈ రక్షాబంధన్ పండుగ గురించి భవిష్యత్ పురాణంలో వివరించారు. విష్ణుమూర్తి దేవతల కోరికల మేరకు బలి చక్రవర్తిని బంధిస్తారు. అయితే ఈ రక్షాబంధనం అతనికి రక్షణగా నిలుస్తుందని విష్ణుమూర్తి బలి చక్రవర్తికి వరమిచ్చారు.
 
పాల్కురికి సోమనాథుడు ఈ పౌర్ణమిని నూలు పున్నమిగా అభివర్ణించారు. ఎందుకంటే నూలుతో వడికిన జంధ్యాన్ని ఈ రోజున ధరిస్తారు. ఈ పండుగను కర్ణాటకలో నారికేళ పున్నమిగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండుగ నిలుస్తోంది. ఈ పండుగ ఈ నెల 26న వస్తోంది.