సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 23 జులై 2018 (14:09 IST)

తొలి ఏకాదశి... ఈ ఒక్క వ్రతం చేస్తే సకల పాపాలు, దోషాలు పోతాయ్...

ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు. ఈ నాడు నుండే చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభవుతుంది. ఈ తొలి

ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు. ఈ నాడు నుండే చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభవుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మంచిదని మహర్షులు తెలియజేశారు. ఈ రోజున ఉపవాస దీక్షతో విష్ణుమూర్తి భజనలు, జాగారాలు చేస్తూ ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తే మంచిది.
 
అలానే నెయ్యితో చేసిన పిండివంటలు, చక్కర పొంగలి, పేలాలు పిండి, వెన్నె మీగడలు ఇవన్నీ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. కనుక వీటిననే ఆ స్వామివారికి నైవేధ్యంగా పెడుతారు. ప్రాచీన కాలంలో ఈ ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు, భీష్ముడు ఆచరించినట్లుగా ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఈ వ్రతాన్ని చేయడం వలన సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయి.
 
ఈ తొలి ఏకాదశి సందర్భంగా పండరీపురంలో పాండురంగస్వామికి ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ శుద్ధ ఏకాదశి రోజునే కోట్లాది భక్తులు ఆ స్వామి వారిని దర్శించుటకు వస్తుంటారు. పండరీపురంలో ఈ పాండురంగస్వామి వారి భజనలతో భక్తులు మారుమ్రోగుతుంటుంది. జ్ఞానదేవుడు, తుకారామ్, చోఖమేళా, సక్కుబాయి, జనాబాయి వంటి భక్తులు కూడా ఈ పాండురంగ స్వామిని పూజించనవారే.