కిక్ ఇస్తున్న కియా కారు... మేడిన్ ఆంధ్రా, ధర ఎంతో తెలుసా?
దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం కియ కార్ల తయారీ సంస్థ కియా, అనంతపురం జిల్లా పెనుకొండ మండలం, యర్రమంచి గ్రామంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి కియా కారును ఆగస్టు 8న ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ తొలి కారుపై రోజా తన తొలి సంతకం చేశారు.
సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ.13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కియా సంస్థ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే తాము రెండున్నరేళ్ల వ్యవధిలో ప్లాంటు, అసెంబ్లీ లైన్‌ను నిర్మించి తొలి కారును తయారు చేయగలిగామని సంస్థ చీఫ్ పార్క్ వ్యాఖ్యానించారు. మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కారు నిలుస్తుందని తెలిపారు.
కాగా ఈ కారును నేడు ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ చేత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కియా కంపెనీ ప్రతినిధులతో పాటు పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఇప్పటికే కియా కార్ల కోసం వేలమంది బుక్ చేసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ముంబైలో జరిగిన కియా కారు లాంఛ్ కార్యక్రమాన్ని మీరూ చూడండి.