శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. స్వాతంత్ర్య దినోత్సవం
  3. స్వాతంత్ర్య సమరయోధులు
Written By ivr
Last Modified: గురువారం, 9 ఆగస్టు 2018 (19:02 IST)

తొలి స్వాతంత్ర్య పోరాటం... ఎప్పుడు జరిగిందో తెలుసా?

భారత గడ్డపై ఆంగ్లేయులు ఏకాధిపత్య పరిపాలనకు వ్యతిరేకంగా తొలి స్వాతంత్ర్య పోరాటం 1852వ సంవత్సరం మే నెల 10వ తేదీన ప్రారంభమైంది. దేశం యావత్తు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళంవిప్పింది. ఇండియా-బ్రిటిష్ సైనిక దళాల్లో పనిచేసిన సిపాయిలపై జరిపిన అక్రమ చర్యలకు

భారత గడ్డపై ఆంగ్లేయులు ఏకాధిపత్య పరిపాలనకు వ్యతిరేకంగా తొలి స్వాతంత్ర్య పోరాటం 1852వ సంవత్సరం మే నెల 10వ తేదీన ప్రారంభమైంది. దేశం యావత్తు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళంవిప్పింది. ఇండియా-బ్రిటిష్ సైనిక దళాల్లో పనిచేసిన సిపాయిలపై జరిపిన అక్రమ చర్యలకు ఆగ్రహం చెందిన భారతీయులు తమ దేశ ప్రజలపై విదేశీయులు ఆధిపత్యం వహించడాన్ని సహించలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో బ్రిటిష్- ఇండియా సైనిక దళాలకు అందించిన ఎన్‌ఫీల్డ్ తుపాకీల్లో ఉపయోగించే తూటాలపై రాసే ఆవు, పంది క్రొవ్వులతో అసలు సమస్య ప్రారంభమైంది. ఈ అంశంపై బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని సిపాయిలు ఎదిరించేందుకు సిద్ధమయ్యారు. జాతి, మత బేధాలు లేకుండా భారతీయులమనే నినాదంతో పోరాటాన్ని ప్రారంభించారు. దీంతో దేశంలో మత విద్వేషాలు తలెత్తాయని బ్రిటిష్ పాలకులు ఆరోపించారు. 
 
అయితే అదే సిపాయిల తిరుగుబాటుగా అవతరించి తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వతంత్ర్య పోరాటంగా మారింది. ఇదిలా ఉండగా భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల ఆధీనం నుండి తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ సమరాన్ని జమీందారులు ముందుండి నడిపించారు. ఆయుధాలను చేతపూని చేపట్టిన ఈ విప్లవంలో కార్మిక వర్గంతో పాటు అన్నీ వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.