గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 14 జూన్ 2014 (16:37 IST)

మఖ నక్షత్రంలో పుట్టారా? వైఢూర్యమును ధరిస్తే?

మఖ నక్షత్రం, రెండో పాదములో పుట్టిన జాతకులు ఐదేళ్ల నుంచి వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిది. ఈ జాతకులకు ఐదేళ్ల నుంచి కేతు మహర్దశ కావడంతో వైఢూర్యమును ధరించడం శ్రేయస్కరమని రత్నాల నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఐదేళ్ల నుంచి 25 సంవత్సరముల వరకు శుక్ర మహర్ధశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వ్రేలుకు ధరించగలరు. 25 సంవత్సరముల నుంచి 37 ఏళ్ల వరకు రవి మహర్దశ కావును కెంపును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 
 
37-41వ సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ కావడంతో ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 41-48 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ కావున పగడమును బంగారములో ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది.
 
49-66 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో మధ్య వేలుకు ధరించగలరు. 66 సంవత్సరముల నుంచి 82 ఏళ్ల వరకు గురు మహర్ధశ కావున ఈ జాతకులు పుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడువేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.