శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (17:44 IST)

మాంగాల్యానికి ముత్యాన్ని చేర్చుకుంటే..?

మాంగల్యానికి దృష్టి సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి నల్లపూసలు, సంతాన భాగ్యాన్ని కలిగించే పగడాలను మంగళ సూత్రాలకు చేరుస్తుంటారు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహ కారకాలుగా చెప్పబడే 'ముత్యాలు' కూడా స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు. 
 
ఇక స్త్రీలు మంగళ సూత్రానికి ముత్యాన్ని చేర్చే ఆచారం మనకి ప్రాచీనకాలం నుంచి కనిపిస్తుంది. శ్రీరామమవమి రోజున సీతారాముల కల్యాణం జరినప్పుడు, అలాగే తమ ఊళ్లో వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిగినప్పుడు, అత్తవారింట్లో వున్న ఆడపిల్లలను ఆహ్వానించే ఆచారం వుంది
 
కల్యాణం సమయంలో స్వామివారికి .. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు పోస్తారు. అలా పోయబడిన ముత్యాలను అక్కడి అర్చకులు వివాహితులైన స్త్రీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తుంటారు. ఆ ముత్యాన్ని మంగళ సూత్రానికి చేర్చి కట్టుకోవడం వలన, అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం సుస్థిరమవుతుందని మాంగల్య దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.