మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2022 (22:27 IST)

మన దేశానికి శ్రీరామచంద్రుని సోదరుడు భరతుడు వల్ల భారతదేశం అనే పేరు వచ్చిందా?

Lord Rama
భారతదేశం అనే పేరు మన దేశానికి ఎలా వచ్చింది? అనే సందేహం చాలామందిలో వుంటుంది. శ్రీరాముడు సోదరుడు అయిన భరతుడు వల్ల మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని కొందరు అనుకుంటుంటారు. కానీ వాస్తవం అది కాదు. మరేంటి?

 
భరతుడు అనే పేరుగలవారు ముగ్గురు వున్నారు. దశరథ మహారాజు-కైకేయి కుమారుడు భరతుడు. ఇతడు శ్రీరాముని సోదరుడు. ఇక రెండవవాడు ఋషభుని జ్యేష్టపుత్రుడు. ఇతడి పేరు భరతుడు. ఈయన పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇక మూడోవాడు.. శకుంతల-దుష్యంతులకు పుట్టినవాడు.