శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (15:20 IST)

పచ్చి పాలు ఆరోగ్యానికి హానికరం...?

పచ్చిపాలు తాగ‌డం ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పచ్చిపాలకు.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం వల్ల ఆహారానికి సంబంధించిన విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్లి తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌లో తేలింది.
 
పచ్చిపాలు తాగడం వలన నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపులో నొప్పి, జ్వరం, కొన్నిసార్లు మూత్ర పిండాలు దెబ్బతిని హఠాన్మరణం కూడా సంభవించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. సూక్ష్మక్రిమిరహిత పాలు తాగడం వలన తలెత్తే ఆహార సంబంధమైన వ్యాధుల కన్నా పచ్చిపాలు తాగడం వలన వచ్చే కలుషిత ఆహార రోగాలు నూరు రెట్లు ప్రమాదకరమని వెల్లడించారు.
 
ఈ మధ్య కాలంలో పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం కూడా జరిగింది. ఆ పాలల్లో సహజ సిద్ధమైన ప్రొటీన్లు, బ్యాక్టీరియా ఉన్నాయని, ఇవి సూక్ష్మక్రిమిరహిత పాలల్లో ఉన్న వాటి కంటే ఆరోగ్యకరంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చి పాలల్లోని ఇన్‌ఫెక్షన్‌ కారకాలైన బ్యాక్టీరియా ఆహార సంబంధ జబ్బులను ప్రధానంగా పిల్లల్లో, గర్భవతుల్లో, వయోవృద్ధుల్లో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో రేకెత్తించే ప్రమాదం ఉందని తెలిపారు.