శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2023 (17:57 IST)

అల్జీమర్స్, ఇలాంటి లక్షణాలు కనబడితే అదే

అల్జీమర్స్ లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరొకరికి భిన్నంగా వుంటుంటాయి. సర్వసాధారణ ముఖ్య లక్షణం ఏంటంటే.. జ్ఞాపకశక్తి సమస్య. ఇంకా మరికొన్ని ప్రాధమిక సంకేతాలు ఏమిటో తెలుసుకుందాము. ఏదైనా విషయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం. ఇటీవలి అనుభవాలు లేదా పరిసరాల గురించి మర్చిపోవడం.
 
ఏం తినాలన్నా తినడానికి ఆసక్తి తక్కువ వుండటం, బరువు తగ్గడం. అకస్మాత్తుగా మూర్ఛలు రావడం. దంత, చర్మం, పాదాల సమస్యలతో సహా సాధారణ శారీరక క్షీణత కనిపించడం. తినే పదార్థాలను మింగడంలో కష్టం వుండటం.
 
తనలో తనే ఏదో గొణక్కోవడం, గుసగుసగా మాట్లాడుకోవడం. నిద్ర సమయాల్లో పెరుగుదల కనిపించడం.