శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 21 జూన్ 2023 (17:56 IST)

కండరాలను రిలాక్స్ చేసే కమ్మని మసాజ్, ఏ నూనెతో ఎలాంటి ఫలితం?

బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె.
 
అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి. ద్రాక్ష విత్తనాల ఆయిల్ చర్మానికి అప్లై చేసినప్పుడు సిల్కీగా వుండి చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ మసాజ్ శరీరానికి నూతన తేజాన్నిస్తుంది. మసాజ్ స్పాలలో వేరుశెనగ నూనె ఉపయోగిస్తుంటారు. దీనికి అలెర్జీ ఉండవచ్చునని ఈ నూనెను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేస్తారు. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.