1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 మే 2017 (10:43 IST)

ఓస్... మామిడి ఆకులేనా అని తీసిపారేయకండి... ఆకులను వేడి నీటిలో మరిగించి రసం తాగితే...

మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. పండుగలు, శుభకార్యాల‌ సమయంలో ఇంటి ద్వారాలకు మామిడి తోర‌ణాలు ఎందుకుక‌డ‌తారో తెలుసా..? మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మ

మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. పండుగలు, శుభకార్యాల‌ సమయంలో ఇంటి ద్వారాలకు మామిడి తోర‌ణాలు ఎందుకుక‌డ‌తారో తెలుసా..? మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. వాటిని ప‌లు అనారోగ్యాలు తొల‌గించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు.
 
కానీ, ప్రతి ఒక్కరి ధ్యాసా మామిడి కాయలపైనే కాదు.. కాస్త మామిడి ఆకులపైనా పెట్టండి. ఎందుకంటే వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయట. ఓస్... మామిడి ఆకులా అని తీసిపారేయకండి. వీటిల్లో ఉండే పోషక విలువల మాటల్లో చెప్పలేనివి. మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ లతో పాటు కాపర్, పొటాషియం, మెగ్నేషియం, ఫ్లెవోనాయిడ్స్, సాపోనిన్స్.. అబ్బో ఇంకెన్నో పోషకాలున్నాయి. 
 
మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల ఏళ్ళుగా, మన ఇంటి తలుపుల ముందు మామిడి తోరణాలు ఉండటం సంప్రదాయంగా వస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలను తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. 
 
నీటిలో మామిడి ఆకులు మరిగించి తాగడం వల్ల... 
1. మామిడి ఆకుల నీటిని తాగకుండా, చెవిలో వేసుకుంటే చెవినొప్పి సమస్యలను దూరం పెట్టొచ్చు.
2. గాయల దగ్గర మామిడి ఆకులని నూరి పెట్టినా, లేదంటే మామిడి ఆకులు మరిగిన నీటిని పోసినా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
3. మామిడి ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇంచుమించుగా మామిడి ఆకులు మరిగిన నీళ్ళు గ్రీన్ టీ లానే పనిచేస్తూ బాడిలోంచి టాక్సిన్స్ తొలగిస్తుంది.
4. ఆస్తమా ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి శ్వాససంబంధిత సమస్యలకు మామిడి ఆకులు మంచి పరిష్కారం.
5. రోజు రాత్రి మామిడి ఆకులు మరిగిన నీటిని తాగితే, కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు.
6. ఈ మామిడి ఆకుల నీటిని రెగ్యులర్‌గా తాగితే లైంగిక పట్టుత్వం పెరుగుతుంది. 
7. నోటి దుర్వాసన, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలకు చెక్. 
8. ఈ మామిడి ఆకుల నీటిని తీసుకోవడం వలన బ్లడ్ రక్తపుపోటు నియంత్రణలో ఉంటుంది.  లో ఉంటుంది.
9. మానసిక ఒత్తిడి, అజీర్ణం వంటి మిగితా సమస్యలపై కూడా మామిడి ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి.