శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (11:02 IST)

టమోటాను రోజుకు రెండేసి నమిలి తింటే ఏమౌతుంది?

టమోటాలో పీచు అధికంగా వుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ రెండు టమోటాలను ఆహారానికి ముందు తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. రక్తంలో చక్కెర స్థాయుల్లో అసమతుల్యత ఏర్పడవు. కొవ్వు నిల్వల

టమోటాలో పీచు అధికంగా వుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ రెండు టమోటాలను ఆహారానికి ముందు తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. రక్తంలో చక్కెర స్థాయుల్లో అసమతుల్యత ఏర్పడవు.

కొవ్వు నిల్వలు లేకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. టమోటాను నిత్యం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సమస్యను దూరంగా వుంచుకోవచ్చు. 
 
టమోటా శరీరంలోని వ్యాధికారకాలను పూర్తిగా నశింపజేస్తుంది. ఇది మధుమేహగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. ఇంకా క్యారెట్ తరహాలోనే టమోటా కూడా కంటి దృష్టికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రిపూట కంటే చూపు మందగించినట్లైతే టమోటా జ్యూస్ తాగటం అలవాటు చేసుకోవాలి. 
 
టమోటాలో క్యాల్షియం, విటమిన్ సి, ఫాస్పరస్ పుష్కలంగా వున్నాయి. తద్వారా శరీరానికి కావలసిన శక్తి అందడంతో పాటు బరువు పెరగనివ్వదు. ప్రతిరోజూ రెండు టమోటాలను నమిలి తినడం ద్వారా బరువు పెరగరు. రెండు నెలల పాటు ఇలా చేస్తే శరీరానికి తగిన ఆకృతి సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.