శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (11:46 IST)

లైంగిక సామర్థ్యాన్ని పెంచే యాలకులు..

వీర్యలోపం, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే..యాలకులను ఆహారంలో చేర్చుకోవాలి. కంప్యూటర్ల ముందు గంటలపాటు కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా వుండటం ద్వారా లైంగిక పరమైన ఇబ్బందులు తప్పట్లేదు. మారుతున్న ఆహారపు

వీర్యలోపం, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే..యాలకులను ఆహారంలో చేర్చుకోవాలి. కంప్యూటర్ల ముందు గంటలపాటు కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా వుండటం ద్వారా లైంగిక పరమైన ఇబ్బందులు తప్పట్లేదు. మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది. అందుకే సంతానోత్పత్తికి మనం చేయాల్సిందల్లా.. పోషకాహారం తీసుకోవడమే. 
 
అయితే రోజూ యాలకులను తీసుకోవడం ద్వారా వీర్య లోపాలను దూరం చేసుకోవచ్చు.  యాలకులను మిఠాయిల్లో మాత్రమే ఉపయోగించడం కాదు.. వీర్య లోపాలను ఇది నయం చేస్తుంది. రోజూ పది ఏలకులను ఆహారంలో చేర్చుకుంటే.. వీర్యవృద్ధి జరుగుతుంది. 
 
ముఖ్యంగా యాలకులను సినియోల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ప్రైవేట్ భాగాలకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. యాలకులను టీలోనూ లేదా వేడి నీటిలో మరిగించి తీసుకోవడం ద్వారా వీర్య లోపాలు, లైంగిక సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.