శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (14:07 IST)

ప్రతిరోజూ చెంచాడు కాకర రసాన్ని తాగితే....?

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది దీనితో తయారుచేసిన కూరలను తినడానికి ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వాటికి చాలా దూరంగా ఉంటారు. మరికొందరు కాస్తంత చక్కెర లేదా బెల్లం కలిపి కూరలను వండుకుని తింటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమే. కాని ఇందులో ఎంత చేదు ఉందో అంతే ఆరోగ్యం కూడా ఉందంటున్నారు వైద్యులు. 
 
అరికాళ్ళ మంటకు కాకర రసం బాగా పని చేస్తుంది. ప్రతిరోజూ ఒక కాకరకాయ తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. కడుపులోని ఏలికపాముల నివారణకు కాకరకాయ దివ్యౌషదంలా పని చేస్తుంది. కాకర గింజలను నూరి ముద్ద చేసుకుని తింటే ఏలికపాములు చనిపోతాయి. 
 
కాకరకయే కాకుండా కాకర ఆకుల్లో కూడా ఔషద గుణాలు అధిక మోతాదులో ఉన్నాయి. కాకరకాయ రసం కుక్క, నక్క వంటి జంతువుల కాటునకు విరుగుడుగా వాడుతారు. కొందరు ఈ ఆకు రసాన్ని గాయాలపై రాస్తారు. దీంతో అవి కొంత వరకూ తగ్గుముఖం పడతాయి. చర్మ వ్యాధులకు, క్రిమిరోగాలకూ ఈ రసం ఎంతో దోహదపడుతుంది.
 
అనిమియా (రక్తలేమి)కి కాకరరసం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ చెంచాడు కాకర రసాన్ని తాగితే కడుపులోని హానికర పురుగులు చనిపోతాయి. రక్తశుద్ధి జరుగుతుంది. కాకరకాయను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.