సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (12:23 IST)

అశ్వగంధ పొడితో ఒత్తిడి మటాష్

అశ్వగంధ పొడిని రోజూ తీసుకుంటే.. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయి. అశ్వంగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఒకటి లేదా రెండు టీస్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాస్ నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు. 
 
అశ్వగంధ పొడిని నెయ్యి, తేనెలతోనూ దీన్ని తీసుకోవచ్చు. అశ్వగంధ పొడిని రోజూ తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు నిద్రమాత్రలు మింగేకన్నా ఈ పొడిని తీసుకుంటే మేలు కలుగుతుంది.
 
అశ్వగంధ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్యలు పోతాయి. వీర్యం వృద్ధి చెందుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
అశ్వగంధ పొడి వల్ల మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
 
అశ్వగంధ చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.