బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 సెప్టెంబరు 2023 (11:57 IST)

అరటి పండు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

brown-banana
అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారు ఆశ్రయించే పండు ఇదే. ఈ పండు ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. ఎలాంటి అరటి పండులో ఎలాంటి పోషకాలు వున్నాయో తెలుసుకుందాము. పండిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వుంటాయి. ఈ అరటి పండు త్వరగా జీర్ణమవడమే కాక వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తినిస్తుంది. 
 
పండిన అరటి పండులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. బాగా పండిన అరటి పండు తక్కువ మొత్తంలో విటమిన్లు, మినరల్స్ వుంటాయి. మగ్గిపోయిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు వుంటాయి.
 
ఎన్ని నల్లటి మచ్చలు వుంటే అంత ఎక్కువ మొత్తంలో చక్కెరలు వున్నట్లు లెక్క. అరటి పండు తిని పడుకుంటే గంటలోపే నిద్రలోకి జారుకోవచ్చు.