Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్షాకాలమైతేనేం? చద్దన్నంలో కాస్త గంజి నీళ్లు కలుపుకుని తాగాల్సిందే...?

బుధవారం, 1 నవంబరు 2017 (14:00 IST)

Widgets Magazine

కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు అవంతట అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం.. వట్టి మెదడుకే పనెక్కువ ఇవ్వడం ద్వారా ఊబకాయం, రక్తపోటు, హృద్రోగాలు తప్పట్లేదు. వీటికి తోడు అలసట, నీరసం ఆవహిస్తుంది. ఈ రుగ్మతల నుంచి బయటపడాలంటే..? రోజంతా చురుగ్గా వుండాలంటే.. అల్పాహారంగా చద్దన్నం తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
రాత్రి మిగిలిన అన్నంలో పెరుగో, లేదా వేడి గంజి, ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. రాత్రి మిగిలిన అన్నంలో ఉదయానికల్లా ఐరన్ చేరుతుంది. అలాగే పోటాషియం, కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఈ చద్దన్నాన్ని రోజు ఇడ్లీ, దోసెలకు బదులు తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
వర్షాకాలంలో గంజి లేదా వేడినీళ్లను కలిపి రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున తింటే.. చర్మ వ్యాధులను తొలగించుకోవచ్చు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం చద్దన్నం తగ్గిస్తుంది. ఇంకా నీర‌సం త‌గ్గిపోతుంది. బీపీ అదుపులో ఉంచే గుణం చద్దన్నానికి వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నిమ్మకాయ రసం, తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే?

దాల్చిన చెక్క వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో వున్నాయి. దాల్చిన చెక్క పొడిని ...

news

క్షయ (టీబీ) భారతం : ఏడు దేశాల్లో అగ్రస్థానం.. డబ్ల్యూహెచ్ఓ నివేదిక

భారత్ టీబీ రోగుల కేంద్రంగా మారుతోందా? అవుననే అంటోంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఈ ...

news

కంటికి మేలు చేసే ఖర్జూరాలు..

కంటి ఆరోగ్యానికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో వుండే.. జియాక్సిథిన్, టూటిన్స్ ...

news

సన్నగా వుండాలనుకుంటే.. రోజుకో ఆపిల్ తినండి..

సన్నగా వుండాలనుకుంటున్నారా..? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజుకో ఆపిల్ తీసుకోండి ...

Widgets Magazine