శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (11:03 IST)

వాల్‌నట్స్ తీసుకుంటే ఆ మూడు పరార్..?

వాల్‌‌నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ గుప్పుడె వాల్‌నట్స్ తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వాల్‌నట్స్‌ను తినేవారిక

వాల్‌‌నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ గుప్పుడె వాల్‌నట్స్ తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వాల్‌నట్స్‌ను తినేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలామటుకు తగ్గినట్లు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడి అయ్యింది. 
 
రోజూ వాల్ నట్స్ తీసుకునేవారిలో మధుమేహం దూరం కావడంతో పాటు గుండె జబ్బులు కూడా నయం అవుతాయి. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను వాల్‌నట్స్ కరిగిస్తాయి. అలాగే క్యాన్సర్‌పై పోరాడే లక్షణాలు వాల్‌నట్స్‌లో పుష్కలంగా వున్నాయి. 
 
ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నియంత్రించడంలో వాల్‌నట్స్ మెరుగ్గా పనిచేస్తాయి. పురుషుల్లో వీర్య కణాలను వాల్‌నట్స్ వృద్ధి చేస్తాయి. మెదడును వాల్‌నట్స్ చురుగ్గా వుంచుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.