శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:29 IST)

థైరాయిడ్‌కు చెక్ పెట్టాలంటే.. పెరుగు, చేపలు తినాల్సిందే..

థైరాయిడ్ సమస్య వేధిస్తుందా? డాక్టర్ల సలహాతో మందులు తీసుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి. ఈ ఆహారాన్ని రోజూవారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు సలహా

థైరాయిడ్ సమస్య వేధిస్తుందా? డాక్టర్ల సలహాతో మందులు తీసుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి. ఈ ఆహారాన్ని రోజూవారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు. థైరాయిడ్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ అర కప్పు పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. ఇక వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తీసుకోవాలి. 
 
పెరుగులో వుండే విటమిన్ డి, ప్రొబయోటిక్స్ థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలు ఇవ్వడంతో పాటు మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 
 
ఆలివ్ ఆయిల్‌ను కూడా వంటల్లో చేర్చుకుంటే థైరాయిడ్ సమస్య దరిచేరదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటితో పాటు కోడిగుడ్లు, రొయ్యలు, పాలకూర వెల్లుల్లి, వాల్నట్స్, పచ్చి పఠాణీలు, బాదం, మష్రూమ్స్ వంటివి డైట్‌లో చేర్చుకుంటే థైరాయిడ్‌ నుండి విముక్తి పొందవచ్చునని వారు చెప్తున్నారు.