శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 జనవరి 2016 (17:47 IST)

మిరియాలు కారంగా ఉంటాయి కానీ అవి చేసే మేలు ఏమిటో తెలుసా...?

సాధారణంగా వంటల్లో కారం కోసం మిరియాలను ఉపయోగిస్తుంటాం. అయితే మిరియాల్లో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగివున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాల్లో క్యాన్సర్ కణాలను నశింపజేసే గుణాలున్నాయని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. మిరియాలతో పాటు పసుపును వంటల్లో చేర్చుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
ఇంకా మిరియాల్లో విటమిన్ ఎ, సి, కెరోటిన్ వంటి ఇతర ధాతువులు ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.  స్కిన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, పేగు క్యాన్సర్లను నిరోధించేందుకు మిరియాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. రోజూ వంటల్లో రెండు స్పూన్ల మిరియాల పొడి చేర్చితే ఆరోగ్యంగా ఉండొచ్చు.
 
జీర్ణశక్తిని మిరియాలు పెంచుతాయి. ఉదరంలో ఆమ్లాలను చేరనీయకుండా అసిడిటీని దూరం చేస్తాయి. మిరియాలు శరీరంలోని నీటిశాతాన్ని క్రమంగా ఉంచుతుంది. తద్వారా బరువును నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.