శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (10:16 IST)

రోజుకో కప్పు బ్లాక్ టీతో గుండెకు బూస్ట్ ఇవ్వండి..!

బ్లాక్ టీ తాగటం ద్వారా వెంట్రులకు చాలా మంచిది. జుట్టును బ్లాక్ టీ ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లాక్ టీ తాగడం ద్వారా కేశాలు నిగనిగలాడుతాయి. గ్రీన్ టీలో ఎక్కువ యాంటీ-యాక్సిడెంట్లు కలిగి ఉండటం ద్వారా చర్మం కోమ

బ్లాక్ టీ తాగటం ద్వారా వెంట్రులకు చాలా మంచిది. జుట్టును బ్లాక్ టీ ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లాక్ టీ తాగడం ద్వారా కేశాలు నిగనిగలాడుతాయి. గ్రీన్ టీలో ఎక్కువ యాంటీ-యాక్సిడెంట్లు కలిగి ఉండటం ద్వారా చర్మం కోమలంగా తయారవుతుంది. చర్మానికి కొత్త రంగు చేకూరుతుంది. అయితే బ్లాక్ టీ తాగటం వల్ల చర్మానికి మేలు చేస్తుంది. కానీ మోతాదు మించకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
ఇక బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్స్.. క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. రోజు బ్లాక్ టీ తాగటం వల్ల స్టమక్, కోలన్, ఉపిరితిత్తుల, ఓవరీస్, రొమ్ము క్యాన్సర్లను నియంత్రిస్తుంది. బ్లాక్ టీ ఎక్కువగా ''టానిన్"ను కలిగి ఉండటం వల్ల గ్యాస్ట్రిక్, పేగుల ఇబ్బందులను తొలగించి, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీ ఎక్కువగా టానిన్‌లని కలిగి ఉండటం వల్ల పేగులలో వచ్చే కళతలను మాన్పిస్తుంది. 
 
డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగటం వలన ఎక్కువ లాభపడతారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగటం వల్ల వారిలో వచ్చే "కరోనరీ ఆర్టేరీ డిస్-ఫంక్షన్'' తగ్గిపోతాయి. కావున రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగేవారిలో, భవిష్యత్తులో వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.