మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (12:06 IST)

అల్పాహారం తీసుకోకపోతే.. ఇవైనా తినాలట..!?

అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
 
ఎప్పుడైనా అల్పాహారాన్ని మానేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగడం, క్యారెట్లూ, కీరదోస ముక్కల వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పూ, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది. పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.
 
అలాగే అల్పాహారంలో ఆకుకూరలను ఆహారంలో తీసుకొంటే మంచిది. జ్యూస్‌లకు బదులుగా పండ్లు తీసుకోవాలి. వాటిని సలాడ్స్‌ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది. ఆకలితో ఉండకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. అంతేకానీ ఒకేసారి ఎక్కువగా తినకూడదు.