శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (14:43 IST)

నారింజలో కంటే క్యాబేజిలో అది ఎక్కువ?

క్యాబేజీ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. మెదడు ఆరోగ్య పరిరక్షణ, నరాల మీది మైలీన్‌ షీత్‌ అనే పొరను కాపాడటానికి క్యాబేజీ వినియోగం ఎంతగానో దోహదపడుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు తగ్గేందుకూ క్యాబేజీ వినియోగం దోహదపడుతుంది. క్యాబేజీలో అధికంగా ఉండే క్యాల్షియమ్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక వాటిని బలోపేతం చేస్తుంది.
 
ఒంట్లో చేరిన వ్యర్థాలు, హానికారక రసాయనాలను క్యాబేజీ బయటికి పంపి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి చక్కని యాంటీ ఆక్సిడెంట్. ఇది నారింజలో కంటే క్యాబేజిలో ఎక్కువగా లభిస్తుంది. తరచూ క్యాబేజీ తినేవారికి క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
 
క్యాబేజీలోని గ్లుటామైన్‌ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌ అలర్జీలు, నొప్పి, వాపులను తగ్గిస్తుంది. గాయాలు మాన్పిస్తుంది. క్యాబేజీలోని బీటాకెరటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే గాక ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.