30 ఏళ్లు దాటాక.. ఎముకలు బలంగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా?

సోమవారం, 10 అక్టోబరు 2016 (13:30 IST)

Raw-milk

ఎముకలు బలంగా ఉండాలంటే.. 30 దాటిన మహిళలు తప్పకుండా క్యాల్షియం తీసుకోవాలి. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1200 మి.గ్రా కాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ కాల్షియం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
క్యాల్షియం కోసం సప్లిమెంట్లను వాడకూడదు. కాల్షియం సప్లిమెంట్లను వాడేవాళ్లు ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులకు కూడా గురికాక తప్పదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించి కాల్షియం శరీరంలో చేరటం వల్ల కిడ్నీలో రాళ్లు, మిల్క్‌ ఆల్కలై సిండ్రోమ్‌లాంటి రుగ్మతలతోపాటు శరీరం ఐరన్‌ను పీల్చుకునే స్వభావాన్ని కుంటుపరుస్తుంది. అలాగే ఇతరత్రా వ్యాధులకు వాడే మందుల మీద కూడా ప్రభావం పడుతుంది.
 
అయితే క్యాల్షియంతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఎముకల నొప్పులు, నీరసం లక్షణాలు కనిపిస్తే రోజూ రెండు పూటలా పాలు తీసుకోవాలి. అలాగే వారానికి మూడు సార్లు పనీర్, పాల ఉత్పత్తులు వంటివి డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరలు వారానికి మూడుసార్లు తీసుకోవాలి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మోతాదుకు మించి మంచి నీరు తాగితే కోమాలోకి వెళతారా?

సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కానీ, నీళ్లు మరీ ...

news

కమలా పళ్లు వచ్చేశాయ్... ఈ పండ్లు తింటే ఉపయోగాలేంటో తెలుసా...?!

సిట్రస్‌ జాతికి చెందిన కమలాఫలం, నారింజ, బత్తాయి, నిమ్మ వంటి ఏ ఫలాన్ని అయినా సరే వాడితే ...

news

జ్యూసర్లు వాడే బ్లేడుతో పండ్లలోని పోషకాలు మటాష్.. ఫ్రెష్ జ్యూసులొద్దు.. పండ్లే ముద్దు..

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ...

news

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచే బీన్స్..

చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ...