శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:54 IST)

పచ్చి ఉల్లిపాయను ఇలా వాడితే.. మధుమేహం పరార్..

పచ్చి ఉల్లిపాయ ముక్కలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా.. మధుమేహాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. న

పచ్చి ఉల్లిపాయ ముక్కలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా.. మధుమేహాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. నోటికి రుచిని కలిగించే ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు.


కానీ మందులు తీసుకుంటూ ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
ముఖ్యంగా ఉల్లిపాయను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రోజూ ఉల్లిని డైట్‌లో భాగం చేసుకుంటే.. మధుమేహంతో బాధవుండదు. ఉదయం పూట 60 గ్రాముల పచ్చి ఉల్లి ముక్కలను తీసుకుంటే.. 20 యూనిట్ల ఇన్సులిన్‌ అందినట్లవుతుంది. ఇన్సులిన్ తీసుకోకపోయినప్పుడు ఉల్లిని ఇలా వాడటం మంచిది. 
 
ఒకవేళ ఒక పూట తినలేకపోతే.. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆ పరిమాణాన్ని విభజించి తీసుకోవచ్చు. ఇలా పది రోజులు లేదా 15 రోజులు పచ్చి ఉల్లి ముక్కలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయను వంటలో ఎక్కువగా వాడడం వలన మధుమేహం దరిచేరదు. దీనితో పాటు వ్యాయామాన్ని మరిచిపోకూడదు. ఇన్సులిన్‌ టాబ్లెట్స్‌ను కూడా క్రమం తప్పకుండా వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.