జామకాయలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?
విత్తనాలు వున్న పండ్లను తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయని చాలామంది అనుకుంటుంటారు. కానీ టొమాటో, జామ, బెండకాయ మొదలైన విత్తనాలను కలిగి ఉన్న ఆహారాన్ని మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు తినకుండా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విత్తనాలు రాళ్లు ఏర్పడే సామర్థ్యాన్ని పెంచవు. రాళ్లు వివిధ రకాలు, ఉదాహరణకు, కాల్షియం రాళ్లు, యూరేట్ రాళ్లు, ఆక్సలేట్ రాళ్లు మొదలైనవి.
పండ్లు ఆరోగ్యకరమైనవి, మూత్రపిండాల వ్యాధి లేని రోగులు అన్ని పండ్లను తినవచ్చు, కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు తమ ఆహారంలో ఆపిల్, బొప్పాయి, బేరి, స్ట్రాబెర్రీలు, జామ, పైనాపిల్ వంటి తక్కువ పొటాషియం పండ్లను చేర్చుకోవాలి.
జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది., అంటే ఇది జీర్ణమై క్రమంగా గ్రహించబడుతుంది. గ్లూకోజ్ స్థాయి క్రమంగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో గొప్పగా పరిగణించబడుతుంది.