బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (02:32 IST)

మధుమేహం ఉన్నవాళ్లు మామిడిపండు ముట్టకూడదా.. ఎవరు చెప్పారు?

మామిడి పండు ఫలాల్లో శ్రేష్టమైన పండు. దీంట్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, యాంటాక్సిడెంట్లు, ఇతర పోషక విలువలు ఎన్నింటికో మామిడి పండు పెద్ద వనరు. దాని తీపితోపాటు దాని పోషక విలువల ప్రయోజనాన్ని జతపర్చి చ

మామిడి పండు ఫలాల్లో శ్రేష్టమైన పండు. దీంట్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, యాంటాక్సిడెంట్లు, ఇతర పోషక విలువలు ఎన్నింటికో మామిడి పండు పెద్ద వనరు. దాని తీపితోపాటు దాని పోషక విలువల ప్రయోజనాన్ని జతపర్చి చూస్తే మామిడి పండు ఎవరూ వద్దని చెప్పటానికి వీల్లేనంత మధురపలంగా నిలిచి ఉంటుంది. ప్రత్యేకించి సీజన్‍‌లో వచ్చే మామిడిపండును తింటే ఆ రుచే వేరు. ఇంత చక్కటి రుచిని, ఆస్వాదనను ఏ పండూ ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. 
 
కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిలోని చక్కెర కారణంగా మామిడి పళ్లను పూర్తిగా తినకుండా ఉండాల్సిరావడంపై చాలా బాధ పడుతుంటారు. కానీ చక్కెర వ్యాధిగ్రస్తులు మామిడి పండు ముట్టకూడదనే భావన పూర్తిగా తప్పు భావన. మధుమేహానికి పాటించే పథ్యం ముఖ్య లక్ష్యం ఏదంటే మన శరీరంలోని గ్లూకోస్ నిల్వలను అదుపులో పెట్టుకోవడమే. అంటే మామిడి పండును అస్సలు తినకూడదని కాదు. కాని ఎంత తినాలి అనే విషయంపై అదుపు సాధించాలి. పైగా మనం తీసుకుంటున్న అన్ని పదార్థాలూ పోషక విలువలు కలిగి ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.
 
ఇప్పుడు మధుమేహ రోగులకు శుభవార్త ఏదంటే, అంతర్జాతీయ ఆహార మార్గదర్శకాల ప్రకారం, మధుమేహ రోగులు ఒక చిన్న మామిడిపండులో సగం పండును కానీ లేక సంగం కప్పు పరిణామంలో మామిడి పళ్ల ముక్కలను కానీ నిక్షేపంగా తీసుకోవచ్చు. ఇలా వారానికి రెండు రోజులు వీరు మామిడి పళ్లను తింటే మధుమేహ రోగుల ఆరోగ్యాన్ని అది మెరుగుపరుస్తుందని అంటున్నారు. అదే సమయంలో మీ గ్లూకోస్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడాన్ని మర్చిపోవద్దు. మామిడి పళ్లు మీరు తినడం లేదా తినకపోవడం అనేది మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గ్లూకోస్ స్థాయిలను పరీక్ష చేయించుకుంటే మీరు తినే ఆహారంపై చక్కటి అదుపును సాధించవచ్చు. 
 
చివరగా, గ్లూకోస్ స్థాయిలను తెలుసుకోవడానికి చక్కటి మార్గం డాక్టర్‌ను కలవడమే. మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను అదుపులోకి ఉంచుకోవడానికి, మీరు మామిడిపళ్లను ఎంత ఎక్కువగా లేదా తక్కువగా తినవచ్చో తెలుసుకోవడానికి మీ డాక్టర్‌ని తప్పక సందర్శించండి. నిజంగా మీరు ఆశ్చర్యానికి గురవుతారు. వైద్యుల సూచన ప్రకారం మీరు నిక్షేపంగా మామిడి పళ్లు తినవచ్చు కూడా.