శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:48 IST)

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలా... ఆహారంలో చేపలను చేర్చండి

మీ పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారా? వారిలో జ్ఞాపకశక్తి ఎంత మాత్రం ఉందని తెలుసుకున్నారా.. ఒకవేళ జ్ఞాపకశక్తి అంతంతమాత్రమే అయితే ఆహారంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. మనం తీస

మీ పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారా? వారిలో జ్ఞాపకశక్తి ఎంత మాత్రం ఉందని తెలుసుకున్నారా.. ఒకవేళ జ్ఞాపకశక్తి అంతంతమాత్రమే అయితే ఆహారంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యానికే కాదు.. మెదడుకు ఎంతో మేలు చేస్తాయని వారంటున్నారు.
 
పాలు, పాల ఉత్పత్తులను అధికంగా ఇవ్వండి. మీ పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ డి శాతం అధికంగా ఉండేలా చూసుకోండి. స్ట్రాబెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్, నేరేడు పండ్లను ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటి-ఆక్సిడెంట్స్‌, విటమిన్- సి, ఒమెగా 3 ఫాట్స్ వుండే పండ్లను కూడా పిల్లలకు ఇవ్వడం ద్వారా మెమరీ పెరుగుతుంది.
 
ఓట్స్, ఎరుపు బియ్యంలో విటమిన్ బి, గ్లూకోజ్ అధికంగా ఉండటంతో రోజూ పిల్లలకు ఆహారంగా ఇవ్వొచ్చు. తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చేపల్లో ఒమెగా 3 ఫాట్స్ అధికంగా ఉండటం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుచేత వారానికి రెండుసార్లైనా పిల్లలకు ఇచ్చే ఆహారంలో చేపల్ని చేర్చుకోవాలి.