1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (16:07 IST)

శీతాకాలంలో పచ్చిమిర్చిని పక్కనబెట్టకూడదట..

శీతాకాలంలో పచ్చిమిర్చిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బంది పడేవారు.. పచ్చిమిర్చిని తగిన మోతాదులో తీసుకుంటే గొప్ప మేలు చేస్తుంది. 
 
అంతేగాకుండా.. ఒబిసిటీతో ఇబ్బంది పడేవారు మిర్చిని ఎక్కువగా తీసుకుంటే మధుమేహం బారిన పడకుండా వుంటారని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది.  
 
రోజు క్రమం తప్పకుండా పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండి మధుమేహం దరిచేరదట. 
 
ఇంకా పచ్చిమిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అయి రక్తంలో షుగర్ లెవల్స్ ఆరవై శాతం వరకు నియంత్రించబడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
 
పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా వుంటుంది. ఇంకా గుండెపోటు రాకుండా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.