శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (16:19 IST)

వళ్లు హూనం చేసే మొండి జలుబు... తగ్గేందుకు చిట్కాలు...

రుతువులు, కాలాలు మారే రోజుల్లో పలురకాల వ్యాధులు ప్రబలుతాయి. వాటిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామందికి సోకే వ్యాధి జలుబు. జలుబు వచ్చిందంటే ఒక పట్టాన పోదు. అంతేకాకుండా అది అంటువ్యాధి కావడంతో మన నుండి ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి జలుబు పట్టిందంటే అది త్వరగా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది. 
 
జలుబును అలక్ష్యం చేస్తే అనేక రకాల ఇన్‌ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. కనుక జలుబు విషయంలో అజాగ్రత్త పనికి రాదు. జలుబును తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాయనాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది. జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పనిచేస్తుంది.
 
ప్రతిరోజూ మూడు పూటలా కొన్ని చుక్కల జిందా తిలిస్మాత్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుంది. జలుబు చేసినప్పుడు రాత్రివేళ పడుకునే ముందుగా వేడిపాలలో చిటికెడు పసుపు వేసి తాగితే జలుబు తగ్గుతుంది. 2 కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది.