శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (16:11 IST)

కిడ్నీని శుభ్రం చేసే కొత్తిమీర: కిడ్నీలోని రాళ్లను కరిగించాలంటే?

మన శరీరంలోని రక్తంలో గల టాక్సిన్లను, ఉప్పును కిడ్నీ యూరిన్ ద్వారా వెలివేస్తాయి. అయితే వేసవిలో శరీరంలోని నీరంతా చెమట ద్వారా ఆవిరైపోతుంది. దీంతో ఉప్పు కిడ్నీలో చేరిపోతాయి. ఇందువల్లే కిడ్నీలో రాళ్లు ఏర్ప

మన శరీరంలోని రక్తంలో గల టాక్సిన్లను, ఉప్పును కిడ్నీ యూరిన్ ద్వారా వెలివేస్తాయి. అయితే వేసవిలో శరీరంలోని నీరంతా చెమట ద్వారా ఆవిరైపోతుంది. దీంతో ఉప్పు కిడ్నీలో చేరిపోతాయి. ఇందువల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి. మన శరీరంలోని ఉప్పు, బ్యాక్టీరియాను తొలగించేందుకు కొత్తిమీర భేష్‌గా పనిచేస్తుంది. కొత్తిమీర కిడ్నీలోని రాళ్లను కరిగేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
కొత్తిమీర రసంలోని రాళ్లను తొలగించుకోవాలంటే.. కొత్తిమీర రసాన్ని తాగాల్సిందే. ఒక కప్పు కొత్తిమీర తరుగును ఓ పాత్రలోకి తీసుకుని.. అందులో నాలుగు కప్పుల నీటిని చేర్చి.. పది నిమిషాల పాటు స్టౌమీద పెట్టి మరిగించాలి. ఈ రసాన్ని ఆరిన తర్వాత వడగట్టి శుభ్రమైన గాజు బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఈ రసాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకుంటే.. కిడ్నీలోని రాళ్లు కరిగి.. యూరిన్ ద్వారా తొలగిపోతాయి.