బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఆర్. సందీప్
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (17:53 IST)

మధుమేహంతో బాధపడేవారు మొక్కజొన్న తింటే? (video)

మొక్కజొన్నలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్నలు తింటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి12, ఐరన్ వంటి ఖనిజాలు రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మొక్క జొన్న ఎనర్జీ లెవెల్స్‌ను పెంచి పోషణ ఇస్తుంది.
 
ఫాస్పరస్ అధికంగా ఉండటం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మెగ్నీషియం అనే ఖనిజం ఎముకల బలానికి తోడ్పడుతుంది. మెదడు నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.
 
షుగర్‌తో బాధపడేవారు మొక్కజొన్నతో చేసిన పదార్థాలు బాగా తినాలి. ఉడికించిన మొక్కజొన్న గింజలు రోజూ తింటే ఎర్ర రక్తకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి బీపీ, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.