శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (10:02 IST)

బొద్దుగా ఉండే అమ్మాయిల్లో 'ఆ' పవర్ ఉండదా?

చాలామంది అమ్మాయిలు లావుగా ఉంటారు. ఇలాంటి వారిలో శృంగార కోర్కెలు తక్కువుగా ఉంటాయని అనేకమంది భావిస్తుంటారు. పైగా, లావుగా ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు సైతం అబ్బాయిలు పెద్దగా ఆసక్తి చూపరు. ముఖ్యంగా, శృంగార కోర్కెలు పెద్దగా ఉండవనీ, ఫలితంగా పడక గదిలో భర్తను సంతృప్తి పరచలేదనే భావన అబ్బాయిల్లో ఉంటుంది. నిజంగా బొద్దుగా ఉండే అమ్మాయిల్లో ఆ కోర్కెలు తక్కువగా ఉంటాయా లేదా అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. 
 
భార్యలు లావుగా ఉండటం చాలా మంది భర్తలకు ఇష్టం ఉండదు. ఈ విషయం పక్కన పెడితే.. కొంతమంది పిల్లలు పుట్టకముందే లావుగా మారుతుంటారు. ఆ లావు బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తే మాత్రం చాలా నష్టం అంటున్నారు నిపుణులు.
 
పిల్లలు పుట్టకముందే బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా లావుగా మారే అమ్మాయిల్లో తల్లి అయ్యే సామర్థ్యం తగ్గిపోతుందట. మహా అయితే.. ఒకరికి జన్మ ఇవ్వగలరట. అంతే.. ఇక రెండో సారి ప్రెగ్నెన్సీ రావడం మాత్రం చాలా కష్టం అంటున్నారు. ఇక కొందరికైతే అసలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడం చాలా కష్టం అంటున్నారు నిపుణులు.
 
నార్వేలోని బెర్గెన్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపారు. దాదాపు 4,322 మంది మహిళలపై ఈ సర్వే జరిపినట్లు వారు చెబుతున్నారు. వారంతా 20ఏళ్ల వయసు దాటినవారు కావడం గమనార్హం. వారిలో 1677మందికి అసలు సంతానం కలగలేదట. కేవలం 488మంది ఒకసంతానం కలిగి ఉండగా.. 2,157మంది ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నారు.
 
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. అసలు సంతానం లేనివారంతా వారి వయసు మించి బరువు కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. కాబట్టి సంతానం కావాలనుకునే అమ్మాయిలు మందుగానే బరువును అదుపులో ఉంచుకోవడం మంచిందటున్నారు నిపుణులు.