శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (18:27 IST)

మధుమేహాన్ని తేలిగ్గా తీసుకున్నారో..? దుష్ప్రభావాలు తప్పవండోయ్..

మధుమేహాన్ని తేలిగ్గా తీసుకున్నారో దుష్ప్రభావాలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహాన్ని తేలిగ్గా తీసుకుంటే.. తరచుగా ఇన్ఫెక్షన్ల బారినపడతారని, జబ్బులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ, గ

మధుమేహాన్ని తేలిగ్గా తీసుకున్నారో దుష్ప్రభావాలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహాన్ని  తేలిగ్గా తీసుకుంటే.. తరచుగా ఇన్ఫెక్షన్ల బారినపడతారని, జబ్బులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ, గుండె జబ్బులు తప్పవు. సాధారణంగా మిఠాయిలు, చాక్లెట్లు తినటం వల్ల మధుమేహం వస్తుందని కొందరు అనుకుంటుంటారు. ఇది నిజం కాదు. మన జీవనశైలి, జన్యుపరమైన అంశాలు దీనికి దోహదం చేస్తాయి.
 
అలాగే పంచదార మానేస్తే మధుమేహం అదే తగ్గుతుందని భావిస్తుంటారు. మధుమేహ నియంత్రణకు చక్కెర, కొవ్వులు తగ్గించటం అవసరమే గానీ పరిస్థితిని బట్టి వైద్య చికిత్స కూడా తీసుకోవాలి. ఇన్సులిన్‌ తీసుకోవటం మొదలుపెడితే ఇక జీవితం అంతమైనట్టేనని భయపడే వారు కూడా కొందరుంటారు. ఇది నిజం కాదు. ఇన్సులిన్‌ అవసరమైతే దాన్ని తీసుకుంటూ మంచి జీవనశైలిని పాటించటం, ఒత్తిడి తగ్గించుకోవటం వంటి వాటితో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పనివేళల్లో మార్పు గంటల తరబడి పనిచేయాల్సి ఉండటం ప్రస్తుత ఉద్యోగులకు శాపంగా మారింది. దీంతో ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం లేదా అధిక రక్తపోటు ముప్పు పొంచి ఉంటోంది. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా మధుమేహం బారినపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.