సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (15:19 IST)

కాలుష్యంతో ఏర్పడే అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే..?

దుమ్ము కణాల వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి విటమిన్ బి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. లివర్, గింజధాన్యాలు, చేప, మాంసం, గుడ్లు, పాలు కొన్ని రకాల

దుమ్ము కణాల వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి విటమిన్ బి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. లివర్, గింజధాన్యాలు, చేప, మాంసం, గుడ్లు, పాలు కొన్ని రకాల సెరెల్స్ వంటి వాటిల్లో బీ12 లభిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చును. 
 
పప్పులు లేక ధాన్యాలు వంటివి తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజ్, స్ట్రాబెర్రీస్, ఆపిల్స్, పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే కాలుష్యంతో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కాలుష్యంతో ఏర్పడే అలర్జీని దూరం చేసుకోవాలంటే.. జామకాయలు, ఎరుపు రంగు బెల్ పెప్పర్స్, బ్రొకోలీ, తృణధాన్యాలు, క్యాలీఫ్లవర్, సిట్రస్ ఫ్రూట్స్, బొప్పాయి పండ్లు డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.