గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (11:09 IST)

జీర్ణశక్తికి ఒత్తిడికి లింకుందా..? సూప్స్, సలాడ్స్ తీసుకుంటే..?

జీర్ణశక్తికి వ్యాధినిరోధకశక్తికి ఒత్తిడి లింకుందా.. అంటే ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటే.. ఆరోగ్యం భేష్‌గా ఉంటుందంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. 80శాతం మన వ్యాధినిరోధక శ

జీర్ణశక్తికి వ్యాధినిరోధకశక్తికి ఒత్తిడి లింకుందా.. అంటే ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటే.. ఆరోగ్యం భేష్‌గా ఉంటుందంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. 80శాతం మన వ్యాధినిరోధక శక్తి సామర్థ్యం జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుందని వారు చెప్తున్నారు. కడుపులో ఉబ్బరం, గుండెలోమంట, గ్యాస్‌ వంటి సమస్యలు ఉత్పన్నమైతే జీర్ణక్రియ తగ్గిందని గమనించాలి. 
 
ఈ సమస్య నుంచి బయట పడాలంటే ‘డీటాక్స్‌’ చర్యలు చేపట్టాల్సిందే. అంటే శరీరంలో వ్యర్థాలని బయటకు పంపించాల్సిందే. అలా చేయడానికి అతిగా శుద్ధిచేసిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. సూప్స్‌, సలాడ్స్‌, తాజా పండ్లరసాలూ, కాయగూరలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలని అలాగే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉప్పూ, పంచదార, నూనెలని మితంగా ఉపయోగించాలి.
 
ఒత్తిడి కూడా మన జీర్ణశక్తిని బలహీనం చేస్తుంది. ఇందుకు మెగ్నీషియం, విటమిన్‌ బి, జింక్‌ ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది. ధ్యానం, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, నడక, చక్కని నిద్ర కూడా ఒత్తిడి తగ్గి జీర్ణశక్తి పెరగడానికి సాయపడతాయి. పెరుగు వంటి ఫెర్మెంటేషన్‌ పదార్థాలు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.