శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (22:02 IST)

రాగి పాత్రలో మజ్జిగ తీసుకోవడం మంచిదేనా?

రాగి పాత్రలో నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపు, మూత్రపిండాలు, కాలేయాలను నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. చాలా మంది రాత్రిపూట రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయం తాగుతారు. కానీ రాగి పాత్రలో మజ్జిగ తీసుకోవడం మంచిది కాదు. 
 
పెరుగులోని గుణాలు లోహంతో ప్రతిస్పందిస్తాయి. కొంతమంది రాగి పళ్ళెంలో అన్నం కూడా తింటారు. ఆ సమయంలో అందులో పెరుగు తినకపోవడమే మంచిది. లేదంటే జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 
 
ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం హానికరం. పాలలోని ఖనిజాలు, విటమిన్లతో రాగి సంకర్షణ చెందుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. అంతే కాకుండా, ప్రతిచర్య కారణంగా వికారం, ఆందోళన తప్పదు. మామిడికాయలు, పచ్చళ్లు, సాస్‌లు, జామ్‌లు, ఎప్పుడూ రాగి పాత్రలో తినకూడదు. వాటిని రాగి పాత్రలో అస్సలు భద్రపరచకూడదు. 
 
ఉదయాన్నే పరగడుపున నిమ్మరసంలో తేనె కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి గ్లాసులో నిమ్మ నీటిని తాగడం తాగడం పూర్తిగా మానేయాలి. నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చేరితే.. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, వేవిళ్లు తప్పవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.