శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (22:42 IST)

అతిగా గ్రీన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా? (video)

Green Tea
గ్రీన్ టీ. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుందని చాలామంది దీన్ని తాగుతుంటారు. బరువు తగ్గడానికి రోజుకు కేవలం 3 కప్పుల గ్రీన్ టీ తాగడం సరిపోతుంది. అతిగా గ్రీన్ టీ తాగితే తలనొప్పి, విరేచనాలు కలుగుతాయి.

 
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఫలితం ఉంటుందనేది అపోహ. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో గ్రీన్ టీ వాంతులకి కారణం అవుతుంది. ఇది చికాకును కూడా కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఎసిడిటీ కూడా వస్తుంది. గ్రీన్ టీకి బదులుగా పుష్కలంగా నీరు త్రాగాలి.

 
గ్రీన్ టీలో టానిన్లు ఉండటం వల్ల కూడా ఎసిడిటీ సమస్యలు వస్తాయి. గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. గ్రీన్ టీ కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది, కాబట్టి వైద్య సలహా లేకుండా దానిని తీసుకోవద్దు. గర్భధారణ సమయంలో అతిగా గ్రీన్ టీ తాగితే హాని కలిగిస్తుంది.