తలనొప్పి పోవాలంటే మునగాకు తినండి..

గురువారం, 10 ఆగస్టు 2017 (09:58 IST)

drumstick leaves

తలనొప్పి, నోటిపూత పోవాలంటే వారానికి నాలుగు రోజులు మునగాకు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దంత సమస్యలు తగ్గాలంటే.. జుట్టు బాగా పెరగాలంటే.. జుట్టు తెల్లబడకుండా వుండావలంటే, చర్మవ్యాధులు రాకుండా వుండాలంటే కచ్చితంగా రోజువారీ డైట్‌లో అరకప్పు మునగాకు వుండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మునగాకును నేతిలో వేయించి తీసుకోవడం ద్వారా రక్తహీనత దూరమవుతుంది. 
 
మునగాకు, మిరియాలు చేర్చి రెండు గ్లాసుల నీటిలో మరిగించి రసం పెట్టుకుని తాగితే, చేతులు, కాళ్ళ నొప్పులు మాయమవుతాయి. మునక్కాయ ఉదర సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. వారంలో రెండుసార్లు మునక్కాయను తీసుకుంటే శరీరంలోని రక్తం, యూరిన్ శుభ్రమవుతుంది. ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవాలంటే మునగాకు సూప్‌ను తాగాలి. స్త్రీ, పురుషుల్లో సంతానలేమి సమస్యను దూరం చేసుకోవాలంటే... మునగాకును డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చింత గింజల పొడిని పాలతో తీసుకుంటే...

చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ...

news

మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...

ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు ...

news

స్మార్ట్‌ఫోన్లు మైకంలో యువత: డేటింగ్ లేదూ.. ఫ్రెండ్సూ లేరు.. గదిలోనే కూర్చుని ఒంటరివారైపోతున్నారు..

టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం ...

news

రోజూ స్కిప్పింగ్ చేయండి.. బరువు తగ్గండి..

రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య ...