చలికాలం ఎముకల బలానికి తినాల్సిన డ్రై ఫ్రూట్స్
శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాము. వాల్‌నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కీళ్ల వాపును నివారిస్తుంది.
బాదం: క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది.
ఖర్జూరం: మెగ్నీషియం, కాపర్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
జీడిపప్పు: వీటిలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా వుండటం వల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది.
అంజీర్: కాల్షియం, పొటాషియం ఎముకలను దృఢంగా చేస్తాయి.
పిస్తా పప్పు: వీటిలో వుండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.