మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (18:14 IST)

చేపలు తినాల్సిందే.. లేకుంటే ఇబ్బందులే.. తెలుసా? (video)

మనం తినే నాన్ వెజ్‌లు అన్నింటితో పోలిస్తే చేపలు ఉత్తమమైనవి, వీటిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. చేపలు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది పలు రకాల మానసిక సమస్యలను కూడా దూరం చేయగలదు. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం చేపలను వారానికి కనీసం 2 నుండి 3 సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. వయస్సు పైబడటం వల్ల సహజంగానే మతిమరుపు వస్తుంది. 
 
కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందట. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. 
 
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలను తరచుగా తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 
 
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా, తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.